బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (10:47 IST)

రూ.9 వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత... విజయవాడలో మూలాలు?

వియవాడలో మూలాలు కలిగిన డ్రగ్స్‌ను గుజరాత్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.9 వేల కోట్లుగా ఉంటాయని అంచనా వేశారు. ఈ డ్రగ్స్ ముఠాకు ఏపీలోని విజయవాడతో సంబంధం ఉన్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుర్తించారు. 
 
కేంద్ర నిఘావర్గాల నుంచి సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న రెండు కంటెయినర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తనిఖీ చేయగా దాదాపు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడింది. ఈ నెల 15న కంటెయినర్లను స్వాధీనం చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేస్తున్న హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ మాటున వచ్చిన ఈ డ్రగ్స్.. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళ్తున్నట్టు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది.