మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (12:12 IST)

ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయ్...

దేశంలోని పసిడి ప్రియులకు ఇది దుర్వార్తే. బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పైపైకి ఎగబాకింది. బంగారం ధర పైకి చేరితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. 
 
గురువారం నాటి మార్కెట్ ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.380 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.47,840కి చేరింది. 
 
అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 పెరుగుదలతో రూ.43,850కు ఎగసింది. మరోవైపు వెండి రేటు కూడా భారీగా పెరిగింది. రూ.1300 పెరుగుదలతో కేజీ వెండి ధర రూ.65,100కి చేరింది.