మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (15:00 IST)

దేశంలో తగ్గిన బంగారం ధరలు

దేశంలో మరోమారు బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల ఈ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూ వచ్చాయి. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా కూడా తగ్గుముఖం పట్టింది. 
 
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.47,220 కి క్షీణించింది. ఇక , 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గుదలతో రూ. 43,290 కు పడిపోయింది. మరో వైపు.. వెండి ధర స్థిరంగా నమోదైంది.. ప్రస్తుతం వెండి ధర రూ.64,200 వద్ద కొనసాగుతోంది.