సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:43 IST)

దేశంలో స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు

దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పులు రావడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
 
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.96.80గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.90 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.80 లకు లభిస్తోంది.
 
ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.62 లకు లభిస్తోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12ఉండగా.. డీజిల్ ధర రూ.93.36గా ఉంది.