గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:01 IST)

ఇండియా అద్భుతమైన ఘనత.. వ్యాక్సినేషన్‌లో వేగం

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అన్ని దేశాలు వ్యాక్సినేషన్ జరుపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకుంటున్నారు. ఐతే ఇక్కడ ప్రపంచంలోనే ఇండియా అద్భుతమైన ఘనత అందుకుంది.
 
ప్రపంచంలోనే ఎక్కువ మందికి మొదటి డోసులు వేసిన దేశంగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ప్రపంచంలోనే ఎక్కువ మందికి వ్యాక్సిన్ షెడ్యూల్ పూర్తి చేసిన దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. దేశం మొత్తం మీద పెద్దవాళ్ళలో 60.7%శాతం మందికి మొదటి డోసు వేయబడింది.
 
ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా పోర్టల్ లో ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో 62.54%శాతం మందికి మొదటి డోసు పూర్తయ్యింది. అదే పట్టణ ప్రాంతాల్లో 36.30%మందికి టీకా వేయబడింది.
 
ఇంకా మిగిలిన 1.16%మందికి లేదా 77లక్షల డోసులు గ్రామీణ, పట్టణ అనే విభాగంలోకి రాకుండా పూర్తయ్యింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శరవేగంగా వ్యాక్సినేషన్ జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ లతో పాటు అనేక ఇతర కార్యక్రమాలు వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచుతున్నాయి.