గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:52 IST)

పెట్రోల్ - డీజల్‌పై జీఎస్టీ? కేంద్రం నిర్ణయం

దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో సెంచరీ కొట్టేశాయి. దీంతో సామాన్యుడు మొదలు గొప్పోళ్ల వరకు ప్రతి ఒక్కరూ గగ్గోలు పెడుతున్నారు. ఈ పెట్రోల్ ధరల పెంపు భారం ప్రతి ఒక్క వస్తువుపై పడింది. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజల్ ధరలకు కళ్లెం వేయడానికి కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పెట్రోల్, డీజల్‌పై జీఎస్టీ విధించాలన్నది ఆ నిర్ణయం. అంటే జీఎస్టీ పరిధిలోకి వీటిని చేర్చాలని భావిస్తున్నారు. 
 
ఈ ధరలకు కళ్లెం వేయడానికి పెట్రో - డీజిల్ ధరలను జీఎస్‌టి పరిధిలోనికి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రాష్ట్రాల సహాయం లేకుండా ఇది అస్సలు సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. 
 
దీని ఫలితంగా పెట్రోల్ - డీజిల్ ధరలు పలు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ.108కి చేరుకున్నాయి. ఇపుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని భావిస్తుంది. ఇందులోభాగంగా, శుక్రవారం లక్నోలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌లో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.