ఫుడ్‌డెలివరీ యాప్‌లపై జీఎస్టీ బాదుడు...
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 17వ తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్ల మాదిరిగా పరిగణిస్తూ ఆయా యాప్‌లు సరఫరా చేసే ఆహార పదార్థాలపై 5 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ విషయంపై ఈ జీఎస్టీ మండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శుక్రవారం జీఎస్టీ మండలి సమావేశంకానుంది. ఇందులోనే, జీఎస్టీ అంశంతో పాటు దాదాపు 50 ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫుడ్ డెలివరీ యాప్‌ల సేవలపై జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనకు జీఎస్టీ మండలి ఆమోదముద్ర వేస్తే ఆయా సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకునేందుకు కొంత సమయం ఇస్తారు.
రెస్టారెంట్ల స్థానంలో ఫుడ్ డెలివరీ యాప్‌లు ఆహార పదార్థాల డెలివరీకిగాను జీఎస్టీని వసూలు చేసి, ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వినియోగదారులపై అదనపు పన్ను భారం ఏమీ పడదు. ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా చిన్నపాటి హోటళ్ల నుంచి కూడా ఆహార పదార్థాలు వినియోగదారులకు అందుతాయి. దీంతో ఆయా హోటళ్లు కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే.