శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:56 IST)

పసిడి రేటు జిగేల్.. తగ్గిన వెండి ధర

దేశంలో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. కానీ వెండి రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. సోమవారం దిగొచ్చిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైకి కదిలింది. నిజంగానే ఇది కొనుగోలుదార్లకు ఇది చెడువార్తే. బంగారం ధర పైకి చేరితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది.
 
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.47,460కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ.43,500కు ఎగసింది.
 
వెండి రేటు నేలచూపులు చూసింది. ఏకంగా రూ.400 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.63,800కు తగ్గింది. వెండికొనే వారికి ఇది ఊరట కలిగించే అంశం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.16 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1775 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు కూడా పడిపోయింది. ఔన్స్‌కు 0.60 శాతం తగ్గుదలతో 22.47 డాలర్లకు క్షీణించింది.