శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:27 IST)

నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసిన భారత్

భారత్‌లో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి సంఖ్య భారీగా ఉంది. భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్‌లను దానం చేస్తోంది. తాజాగా భారత్ నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసింది. ఈ విషయాన్ని నేపాల్ ఇండియా రాయభారి నీలాంబర్ ఆచార్య వెల్లడించారు. 
 
భారత్ తమకు ఒక మిలియన్ వ్యాక్సిన్‌లను దానం చేయగా మరో రెండు మిలియన్ల వ్యాక్సిన్‌లను కొనుగోలు చేశామని చెప్పారు. అక్టోబర్ నుండి వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని ప్రారంభింస్తామని నీలాంబర్ ఆచార్య స్పష్టం చేశారు. 
 
ఇక భారత్ మరియు నేపాల్ సరిహద్దుల్లో కొన్ని వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని కానీ అవి భారత్‌తో సంబంధానికి అడ్డుకాదని అన్నారు. భారత్ నేపాల్ మధ్య మంచి బంధం ఉందని భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధం మరింత బలపడుతుందని ఆచార్య అభిప్రాయపడ్డారు.