ఎండిపోయిన ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకుంటే?
ఉసిరికాయ నిత్యయవ్వనులుగా ఉండే టానిక్‌లా ఉపయోగపడుతుంది. అంటువ్యాధులు దూరమవుతాయి. గుండె, కిడ్నీలకు బలాన్నిస్తాయి. ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీ స్పూన్ తేనెను కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కంటి లోపాలుండవు. కండరాలు బలపడతాయి.
ఉసిరి రసంతో పాటు కాకర కాయ రసం చేర్చి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ నేరేడు పొడి, ఒక స్పూన్ కాకర కాయ పొడి చేర్చి తీసుకుంటే మధుమేహ వ్యాధిని నయం చేసుకోవచ్చు.
ఎండిపోయిన ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రెండు ఉసిరికాయలను నీటిలో నానబెట్టి ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేస్తే కళ్లు ఎర్రబడటం, దృష్టి లోపాలు వుండవు. అలాగే ఉసిరికాయ గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని వాటిని టెంకాయ నూనెలో బాగా మరిగించి, తర్వాత ఆరనించి.. మాడుకు పట్టిస్తే జుట్టు మృదువుగా తయారవుతాయి.
అనారోగ్యాలను ఉసిరికాయ తీసుకోవడం ద్వారా ముందుగానే నియంత్రించుకోవచ్చు. ఇకపోతే.. ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్ ఉన్నాయి. ఆరెంజ్ పండు కంటే ఉసిరిలో 20 రెట్లు విటమిన్ సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.