బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (23:16 IST)

కోడుగుడ్డు సంగతులు, తింటారు కానీ తెలుసుకోరు

గుడ్డులో పచ్చసొనలో కొవ్వులు వుంటాయి. 50 గ్రాముల బరువున్న గుడ్డులో 5 గ్రాముల కొవ్వు లభిస్తుంది. కానీ అందులో శాచ్యురేటెడ్ కొవ్వులు 27 శాతమే. మిగిలినవన్నీ ఆరోగ్యకరమైన ఒమేగా ప్యాటీ 3 ఆమ్లాలే. 
 
కెరోటినాయిడ్లూ ఎ,ఇ,డి,కె విటమిన్లు కూడా అచ్చంగా పచ్చసొనలోనే వుంటాయి. విటమిన్ బి5, బి6, బి12, ఫోలేట్, కోలీన్లు, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, ఐరన్లలో 90 శాతం పచ్చసొనలో దొరుకుతుంది. ప్రోటీన్లు 40 శాతం వుంటాయి. డి విటమిన్ సహజంగా దొరికే ఆహారం గుడ్లు పచ్చసొన ఒకటి. 
 
మెదడు పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది. అందకే పాలిచ్చే తల్లులు , గర్భవతులు పచ్చసొనతో కూడిన గుడ్డును తినడం మంచిది. గుడ్డు పచ్చసొన నుంచి 60 క్యాలరీలు లభిస్తే తెల్లసొన నుంచి 15 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి.