సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (23:07 IST)

చింతచిగురును ఉడికించిన నీటితో పుక్కిలిస్తే...

చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ చిగురును ఉడికించిన నీటితో పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండటమే ఇందుకు కారణం. 
 
కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి. 
 
తరచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే గాక, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింత చిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.