గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (23:22 IST)

రోగ నిరోధక శక్తిని పెంచే పచ్చి కొబ్బరి.. రోజూ తింటే..?

చర్మం నిగారింపును సంపాదించుకోవాలంటే.. పచ్చి కొబ్బరిని తినాల్సిందే. ప‌చ్చి కొబ్బ‌రిలో కాప‌ర్‌, ఐర‌న్‌, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, సెలీనియం, జింక్, విట‌మిన్ బి1, బి5, బి9 త‌దిత‌ర విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అందుచేత ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. 
 
అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ప‌చ్చి కొబ్బ‌రి మంచి ఆహారం. డ‌యాబెటిస్ ఉన్న‌వారు పచ్చి కొబ్బ‌రిని తింటే వారి ర‌క్తంలో ఉన్న షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. ప‌చ్చికొబ్బ‌రిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. 
 
ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు ప‌చ్చి కొబ్బ‌రి తినాలి. అఆగే గుండె జ‌బ్బుల స‌మస్య‌లు ఉన్న‌వారు ప‌చ్చి కొబ్బ‌రిని తింటూ ఉంటే గుండె ఆరోగ్యం మెర‌గ‌వుతుంది. ర‌క్త‌స‌ర‌ఫ‌రా స‌రిగ్గా ఉంటుంది. హైబీపీ త‌గ్గుతుంది.