శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (22:39 IST)

వాస్తు టిప్స్.. ఆర్థిక ఇబ్బందులకు బైబై చెప్పాలంటే.. తులసి మొక్కను..?

ప్రతీ ఇంట్లో తులసి మొక్క ఉండడం మంచిదని వాస్తు శాస్త్రం చెప్తోంది. తులసిలో ఎన్నో ఔషధాలున్నాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి, ప్రతికూల ఫలితాలను దూరం చేసుకునేందుకు ఇంట్లో తులసి మొక్క నాటండి అంటున్నారు వాస్తు నిపుణులు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఇట్టే తొలగిపోతాయని వారు సూచిస్తున్నారు. 
 
ఇంట్లో మొక్క నాటడానికి స్థలం లేనట్టయితే పూలకుండీలో కూడా నాటుకోవచ్చు. అలాగే ఒత్తిడి నుండి బయటపడడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి పడకగదిలో లావెండర్ మొక్కను పెంచడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. 
 
ఇంకా, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే.. రోజ్ మేరీ, స్పైడర్ మొక్కలు నాటడం మంచిది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు ఆర్థికంగా వచ్చే ఇబ్బందులు రాకుండా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.