సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (23:38 IST)

ఇంటికి ఆ దిశ తేడాగా వుంటే పరాయి స్త్రీలపై విపరీతమైన కామవాంఛలు...

ఈశాన్యం బాగులేనట్లయితే గృహస్తు మోసగించబడటం జరుగుతుంది. ముఖ్యంగా పరాయి ఆడవారి చేతుల్లో మోసానికి గురికావడం జరుగుతుంది. చెంప దెబ్బలు తినడం, పరాయి స్త్రీలపై విపరీతమైన కామవాంఛలు ఏర్పడటం జరుగుతుంది. ఉత్తర వాయవ్య దోషాలు కూడా కలిసినట్లయితే ఇక పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది.
 
తప్పుడు పనులు ఎక్కువ చేయడం జరుగుతుంది. ఈ పనులు చేస్తూ దొరికిపోవడం జరుగుతుంది. అవమానాలు జరగడం, పదిమందిలో తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేకపోవడం వంటివి జరుగుతాయి. స్వయంగా వెళ్లి ఎదుటివారికి తమ జుట్టును చేతికి అందించే పరిస్థితికి చేరుకుంటారు.
 
చేయరాని పనులు చేసి వారి చేతుల్లో ఇరుక్కుని లాక్కో లేక పీక్కోలేక గిలగిల లాడే పరిస్థితి దాపురిస్తుంది. అందువల్ల దిక్కుల యొక్క వాస్తు స్థితి తప్పక చూసుకుని గృహాన్ని నిర్మించుకోవాలని వాస్తు శాస్త్రం చెపుతుంది.