ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2021 (22:55 IST)

హైదరాబాద్‌లో ప్రాప్‌ టైగర్‌ ‘రైట్‌ టు హోమ్‌’ ఎక్స్‌పో రెండవ ఎడిషన్‌ కోసం రాయితీలు

తమ మొట్టమొదటి వర్ట్యువల్‌ ఎడిషన్‌ 2020లో సాధించిన అపూర్వ విజయపు స్ఫూర్తితో ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ ఇప్పుడు తమ రెండవ ఎడిషన్‌ ‘రైట్‌ టు హోమ్‌’ ఎక్స్‌పోను జాతీయ స్థాయిలో ఆరంభించనున్నట్లు వెల్లడించింది.  దీనిని హైదరాబాద్‌లో కూడా కూడా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 మరియు 7, 2021 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే ఈ రెండు రోజుల ఎక్స్‌పోను హైటెక్ సిటీ- రాడిసన్‌ హైదరాబాద్‌ వద్ద ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నిర్వహించనున్నారు.
 
ఈ ఎక్స్‌పోలో భాగంగా 1730 గృహ యూనిట్లను పలు ధరల విభాగాలలో ప్రదర్శించనున్నారు. ప్రధానంగా ఈ గృహాల ధరలు 45 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల ధరల నడుమ ఉంటాయి.
 
ఈ ఆవిష్కరణ సందర్భంగా శ్రీ రాజన్‌ సూద్‌, బిజినెస్‌ హెడ్‌, ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ మాట్లాడుతూ, ‘‘రికార్డు స్థాయిలో అతి తక్కువ వడ్డీరేట్లు ఉండటంతో పాటుగా సెక్షన్‌ 80 ఈఈఏ(గృహ ఋణాలపై చెల్లించే వడ్డీరేట్లుపై రాయితీ)ని మరో సంవత్సరం పాటు విస్తరిస్తున్నట్లుగా ఇటీవలి బడ్జెట్‌లో వెల్లడించడం వల్ల 2021వ సంవత్సరం గృహ ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన అవకాశం కల్పించింది.
 
ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని మరియు వినియోగదారుల సెంటిమెంట్‌ కూడా పెరిగిందని ఇటీవలి కాలంలో మేము చేసిన కన్స్యూమర్‌ సెంటిమెంట్‌ సర్వేలో వెల్లడైంది. మేమిప్పుడు రైట్‌ టు హోమ్‌ కార్యక్రమ రెండవ ఎడిషన్‌ను ఆరంభించాం. హైదరాబాద్‌ను ఇది కవర్‌ చేయడంతో పాటుగా గృహ కొనుగోలు దారులు భారీ రాయితీలను ఈ పరిశ్రమలోని సుప్రసిద్ధ బ్రాండ్ల వద్ద పొందే అవకాశమూ అందిస్తుంది. మా ప్రోపర్టీ నిష్ణాతులు ఈ ఉత్సాహ పూరితమైనప్పటికీ, ఆర్థికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియలో  కొనుగోలుదారులకు సహాయపడతారు’’ అని అన్నారు.
 
పరిశ్రమలో అగ్రశ్రేణి బ్రాండ్లలో కొన్ని ఈ ఎక్స్‌పోలో పాల్గొనబోతున్నాయి. ఈ కార్యక్రమంలో సంభావ్య గృహ కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులు తమకు అనుకూలమైన ఆస్తిని ఎంచుకోవడంతో పాటుగా ఆకర్షణీయమైన రాయితీలను ఎలాంటి బ్రోకరేజీ చార్జీలను చెల్లించకుండా పొందవచ్చు.
 
ఈ కార్యక్రమంలో కొనుగోలుదారులు ఆకర్షణీయయైన ఆఫర్లను రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులపై పొందవచ్చు. దీనిలో భాగంగా ఆన్‌ స్పాట్‌ ఆఫర్లు, అతి తక్కువ ధరల హామీ, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన చెల్లింపు ప్రణాళికలు, జీఎస్‌టీ మరియు స్టాంప్‌ డ్యూటీ రద్దు, ఖచ్చితమైన బంగారం నాణెములను బుకింగ్స్‌పై పొందడం, గృహ ఋణాలలో సహాయం వంటివిసైతం అందిస్తారు.
 
ఈ కార్యక్రమం, కొనుగోలుదారులకు ఈ రంగ నిష్ణాతులను కలుసుకోవడంతో పాటుగా డెవలపర్లను సైతం కలుసుకుని ప్రోపర్టీ మార్కెట్‌ మరియు దాని సంభావ్య వృద్ధి గురించి మరింతగా అర్ధం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఎలారా టెక్నాలజీస్‌ను రియా గ్రూప్‌ నియంత్రిస్తుంది. ఈ పోర్టల్‌ను ఇది సొంతం చేసుకోవడంతో పాటుగా మార్చిలో  ఈ ఆన్‌లైన్‌ ఎడిషన్‌ నిర్వహించబోతుంది.
 
హైదరాబాద్‌ హౌసింగ్‌ మార్కెట్‌లో అగ్రశ్రేణి డెవలపర్లు ఈ ఎక్స్‌పోలో పాల్గొనడంతో పాటుగా తమ ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ సంస్ధలలో బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌, రామ్కీ, సుమధుర, అర్బనైజ్‌, శ్రీనిధి, ఫార్చ్యూన్‌, ఇన్‌కార్‌, బీఎస్‌సీపీఎల్‌ మొదలైనవి ఉన్నాయి. ఈ ఎక్స్‌పోలో పలు ఆస్తులను విభిన్న విభాగాలలో ప్రదర్శిస్తున్నారు. వీటిలో అందుబాటు ధరల విభాగం మొదలు విలాసవంతమైన గృహాల వరకూ ఉంటాయి. ఆగస్టు 2020లో దీని మొదటి సంచికను దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా డెవలపర్లు పాల్గొనగా, ఆకర్షణీయంగా 12వేల రిజిస్ట్రేషన్స్‌ జరిగాయి.