తెలంగాణలో తగ్గిన కరోనా-కొత్తగా 185 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,94,924కి చేరుకుంది.
కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1604కి చేరుకుంది. తెలంగాణలో 2,008 యాక్టివ్ కేసులున్నాయి. 2,91,312 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గత పక్షం రోజులుగా రోజుకు 250లోపు కేసులు నమోదవుతున్నాయి. గత పదిహేను రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,15,669 కొవిడ్ టెస్టులు చేయగా 3621 పాజిటివ్‌లు మాత్రమే వచ్చాయి. జనవరిలో రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.83 శాతంగా నమోదైనట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో కొత్తగా మరో 152 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,94,739కు పెరిగింది. వైరస్ కారణంగా ఒకరు చనిపోవడంతో మరణాల సంఖ్య 1602కు చేరింది.
సోమవారం మరో 221 మంది డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి సంఖ్య 2,91,115కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2022 యాక్టివ్ కేసులున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 29 రంగారెడ్డిలో 11 కేసులు వచ్చాయి.