మహిళలకు గుడ్‌న్యూస్.. పడిపోయిన బంగారం, వెండి ధరలు
దేశంలో గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో దాని ప్రభావం బంగారం ధరలపై పడింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు తగ్గడం విశేషం. బంగారం ధరలు తగ్గడంతో మహిళలు బంగారం కొనుగోలుపై దృష్టిసారించారు.
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.45,150కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.49,260కి చేరింది.
ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 8100 తగ్గి 71,000 కి చేరింది. బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం ఉంది.