1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

శనగ రోల్స్ కూర

వంటకాలు శాకాహారం శనగ రోల్స్ కూర శనగపిండి కారం జీలకర్ర ధనియాలపొడి ఇంగువ గరంమసాలా పొడి పసుపు మజ్జిగ పచ్చిమిర్చి కొత్తిమీర
FileND
కావలసిన పదార్థాలు :
శనగపిండి... పావుకేజీ
కారం... రెండు టీస్పూన్లు
జీలకర్ర... ఒక టీస్పూన్
ధనియాలపొడి... రెండు టీస్పూన్లు
ఇంగువ... చిటికెడు
గరంమసాలాపొడి... అర టీస్పూన్
పసుపు... ఒక టీస్పూన్
చిలికిన మజ్జిగ... ఒక కప్పు
పచ్చిమిర్చి.... నాలుగు
కొత్తిమీర... ఒక కట్ట
ఉప్పు... రుచికి సరిపడా
నూనె... తగినంత

తయారీ విధానం :
శనగపిండిలో ఒక టీస్పూన్ కారం, గరంమసాలా పొడి, ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని దళసరి చపాతీల్లాగా తయారు చేసి పొడుగ్గా అంగుళం వెడల్పున కట్ చేసుకుని రోల్స్‌లాగా చుట్టుకోవాలి. తరువాత వీటిని వేడినీటిలో ఉడికించాలి.

దీంతో అవి గట్టిపడి, తెల్లగా అయిన తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడయిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, తక్కిన దినుసులు వేసి వేయించాలి. తరువాత అందులో మజ్జిగ, ఒక కప్పు నీటిని కూడా పోసి మరో మూడు నిమిషాలపాటు ఉడికించాలి.

చివరగా కూర ఉడుకుతుండగా, పక్కన పెట్టుకున్న శనగపిండి రోల్స్‌ను అందులో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. కొత్తిమీర చల్లి దించుకుని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి