1. ఇతరాలు
  2. »
  3. మహిళ
  4. »
  5. కథనాలు
  6. Pregnancy

Women | Pregnancy | Suitable Time | Health | ఏ వయసులో గర్భధారణ మంచిది...?!!

మహిళ
FILE
ఏ వయస్సులోనైనా గర్భదారణ ఛాలెంజ్‌గానే వుంటుంది. గర్భదారణకు అవకాశమైన, సంతోషపూరిత సమయం ఏదీ అనుకుంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా భార్యాభర్తలు సిద్ధంగా వుండడమే. శారీరక రీత్యా చూస్తే గర్భదారణకు 20-25 సంవత్సరాల మధ్య వయస్సు అనువైనది.

ఈ వయస్సులో ఫెర్టిలిటీ ఉత్తమంగా ఉంటుంది. మహిళలు సాధారణంగా ఈ వయస్సులో ఆరోగ్యంగా వుంటారు. గర్భ సంబంధింత సమస్యలు ఈ వయస్సులో సాధారణంగా తలెత్తవు. బిడ్డ టీనేజ్‌కు వచ్చేసరికి వయస్సు ఎక్కువ గల తల్లిదండ్రులు కంటే ఈ వయస్సులో వారు అధిక శక్తితో ఉంటారు.

ముప్పైలలోకి అడుగు పెట్టేకొద్ది వారి ఫెర్టిలిటీ శాతం తగ్గడం ఆరంభిస్తుంది. ముప్పైనలభైల మధ్యకు వచ్చే సరికి గర్భం దాల్చడం క్లిష్టంమవుతుంది. 35 సంవత్సరాలు దాటిన వారికి గర్భస్రావాలు, పుట్టుక లోపాలు ఎక్కువవుతాయి. డయాబెటిస్ (గర్భధారణలో వచ్చేది) హైపర్ టెన్షన్, సమయం కంటే ముందే ప్రసవాలు వంటి సమస్యల శాతం కూడా పెరుగుతుంది.

అయితే, వైద్యశాస్త్ర పురోగతి దృష్ట్యా సరైన చికిత్సలు... జాగ్రత్తల వల్ల ఈ సమస్యల్ని అధిగమించవచ్చు. వయస్సు సంగతిని పక్కన వుంచితే, గర్భధారణకి ఆరోగ్యంగా వుండటమన్నది ప్రధానం. సంపూర్ణ ఆరోగ్యంతో వున్నట్టయితే ఏ వయస్సులోనైనా గర్భం దాల్చవచ్చు. ఎవరికివారు తమ అవకాశాలు, అవసరాల్ని దృష్టిలో వుంచుకుని ప్లాన్ చేసుకోవాలి.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి