గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-01-2024 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం....

Mithunam
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య ఐ॥ చవితి తె.6.16 పుబ్బ సా. 5.12 రా.వ.1.10 ల 2.56. ప. దు. 12.24 ల 1.08 పు. దు. 2.36 ల3.20.
 
ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- చేతి వృత్తులు, వ్యాపార రంగాల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. హోటల్, క్యాటరింగ్ రంగాలవారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. బంధు మిత్రుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు మీరే చూసుకోవటం మంచిది. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
వృషభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ జీవితం మీరు కోరుకున్నట్లుగానే చక్కగా మలసుకోవడాని ప్రయత్నించండి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం.
 
మిథునం :- స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో మెళుకువ అవసరం. విదేశాల్లోని ఆత్మీయులకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రత్యర్థుల విషయంలో తెలివిగా వ్యవహరించడం మంచిదని గమనించండి. మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి.
 
కర్కాటకం :- ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. ధనం చేతిలో నిలబడటం కష్టంకావచ్చు. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల, వస్తువుల పట్ల మెళుకువ అసవరం. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తగలవు.
 
సింహం :- పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి వుంటుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 
కన్య :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. స్థిరాస్తిని అమర్చుకోవలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
 
తుల :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వ్యాపార విషయంలో ఇతరుల జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితుల కోసం అధికంగా ధనం వ్యయం చేస్తారు. విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- బాధ్యతలు పెరిగినా మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనేమీ కోరిక నెరవేరుతుంది. కళాత్మక విలువలకు ప్రోత్సాహమిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. రుణాల కోసం అన్వేషిస్తారు.
 
ధనస్సు :- సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తుంది. తల, ఎముకలకు సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలు సందర్శిస్తారు.
 
మకరం :- మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతలారు. ప్రత్యర్థులు మిత్రులుగామారి సహాయం అందిస్తారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది.
 
కుంభం :- తొందరపడి వాగ్దానాలు చేయుట వలన మాటపడక తప్పదు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. పాత సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మీ సంకల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి.
 
మీనం :- జీవిత భాగస్వామితో తలెత్తిన వివాదాలు క్రమేణా సమసిపోతాయి. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మిత్రుల కలయిక సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరికొంత కాలం వాయిదావేయటం ఉత్తమం.