Astrology Monthly Horoscope Details

Notifications

మీనం మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఈ మాసం శుభాశుభాల మిశ్రమ సమ్మేళనం. వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అతికష్టంమ్మీద పనులు అవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆత్మీయు ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే సాగించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. కొత్తప్రదేశాలు సందర్శిస్తారు.

నా జీవితాన్ని ప్రధాని మోడీ నరకం చేశారు : రుచికా సింగ్ (వీడియో)

నా జీవితాన్ని ప్రధాని మోడీ నరకం చేశారు : రుచికా సింగ్ (వీడియో)ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జీవితాన్ని నరకం చేశారని రుచికా సింగ్ అనే యువతి వాపోతోంది. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ ప్రవేశ పరీక్షలో సంస్కరణలు, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కొన్ని రోజుల పాటు ఆందోళన జరిగింది. ఇందులో రుచికా సింగ్ అనే యువతి కూడా పాల్గొంది. ఆమె ప్రధాని మోడీ, ఆయన తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత కొద్ది వారాల క్రితం తనను క్షమించమని వేడుకున్న ఆ యువతి.. ఇపుడు నా జీవితాన్ని ప్రధాని మోడీ నరకం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ సరికొత్త వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ప్రధాని మోడీపై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. పైగా, ఇకపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

30-08-2026 ఆదివారం ఫలితాలు - ప్రతికూలతలు అధికం

30-08-2026 నుంచి 05-09-2026 వరకు వార ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు

30-08-2026 నుంచి 05-09-2026 వరకు వార ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టవద్దుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మంగళవారం నాడు అవగాహన లేని విషయంలో జోక్యం తగదు. కొందరు మీ వైఖరిని తప్పుపడతారు. ప్రముఖులు వాదనతో వివాదం సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఫోన్ సందేశాల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వివరాలు వెల్లడించవద్దు. మీ ఇబ్బందిని ఆప్తులకు తెలియచేయండి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. కొత్తయత్నాలు చేపడతారు.