ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. హామీలిచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఇబ్బందులను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాలతో తీరిక ఉండదు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు పనిభారం.