Mobile Phone: ఛార్జింగ్‌లోని మొబైల్ ఫోన్ పేలిపోయింది.. ఎవరికి ఏమైందంటే?
Updated: Fri, 30 Oct 2026 (15:17 IST)
ప్రకాశం జిల్లా, గూడూరు మండలం, పజార్ల గ్రామంలో శుక్రవారం ఒక ఇంట్లో ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్ ఫోన్ పేలిపోయింది. తిరుమల అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. అతను లేని సమయంలో ఫోన్ పేలి, మంటలు చెలరేగి ఇంటి సామాన్లు దెబ్బతినడంతో పాటు గోడలపై గీతలు పడ్డాయి.
అదృష్టవశాత్తు, సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ ఇంట్లోని సామగ్రి, గృహోపకరణాలు మంటల్లో కాలి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి కావడంపై తిరుమల ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
మరింత చదవండి