కరోనావైరస్ మనకు తెచ్చిన అతిపెద్ద కష్టం ఒక మనిషికి మరో మనిషిని దూరం చేయడం. దానినే ఇప్పుడు మనం ఏకాంతం, క్వారంటైన్, సోషల్ డిస్టన్సింగ్ లాంటి మాటలతో చెప్పుకుంటున్నాం. సోషల్ మీడియాలో కరోనావైరస్‌కు సంబంధించి ఇటీవల వైరల్ అవుతున్న ఎన్నో ఫొటోలను మీరు చూసే ఉంటారు. కొన్ని ఫొటోల్లో శవపేటికలతో ఉన్న జనాల వరుసలు మనకు కనిపిస్తుంటాయి. వాటిని చూస్తే మనిషిని మరణం తర్వాత కూడా అంతం కాని...