ఎలాగో కరోనా వచ్చింది కదా, ఇక బతకలేమని శృంగారంలో పాల్గొంటున్నారట?
కరోనా సోకి ఆసుపత్రుల్లో చేర్పిస్తే చికిత్స పొందుతూ చివరకు కామ కోరికలను దాచుకోలేక ఏకంగా శృంగారంలోనే పాల్గొంటున్నారట రోగులు. ఇదంతా వినడానికి వింతగానే ఉన్నా జరుగుతున్న మాట వాస్తవమేనని ఉగాండా ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారిని ఏం చేయాలో తెలియక ప్రస్తుతం వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా కరోనా సోకగా లక్షమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందుకే లాక్ డౌన్‌ను మన దేశంలో పెట్టిన విషయం తెలిసిందే. ఇతర దేశాల్లో కూడా ఇదేవిధంగా కొనసాగుతోంది. అయితే ఆఫ్రియా ఖండంలోని ఉగాండాలో కూడా వేలమందికి కరోనా సోకింది. వారందరినీ తీసుకొచ్చి క్వారంటైన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు.
ఒక పెద్ద వార్డు ఏర్పాటు చేసి పాజిటివ్ వచ్చిన వారందరినీ అందులోనే ఉంచారట. అయితే ఒంటరితనాన్ని భరించలేని కొందరు మరికొందరితో ఆకర్షితులై రాత్రివేళ శారీరకంగా కలుస్తున్నారట. దీన్ని అడ్డుకునేందుకు వైద్యాధికారులు శాయశక్తులా ప్రయత్నం చేశారట. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారట.
అయితే పాజిటివ్ రోగులను ఏం చేయాలో తెలియక ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. పాజిటివ్ వ్యక్తులు శారీరకంగా కలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలా కలిసిన వారిని హెచ్చరిస్తున్నారు కూడా. అయితే వాళ్ళలో మాత్రం మార్పు రావడం లేదట. ఎలాగో కరోనా వచ్చింది కదా ఇక బతకలేమని నిర్ణయించుకుని అలా మరికొంతమంది చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.