సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (17:47 IST)

29 రోజుల శిశువును బలిగొన్న కరోనా.. అత్యంత పిన్న కరోనా బాధితుడిగా..

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో.. దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనాతో మృతి చెందారు. తాజాగా కరోనా వైరస్‌తో 29 రోజులు పసికందు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌లోని బటంగస్ ప్రావిన్స్‌కు చెందిన 29 రోజుల శిశువు కరోన బారినపడి పుట్టి నెల కూడా గడవకుండానే ఊపిరి విడిచింది.
 
 ప్రపంచంలో కోవిడ బారినపడి మృతిచెందిన అత్యంత పిన్న కరోనా బాధితుడు ఈ శిశువే కావడం గమనార్హం. కరోనా సోకడంతో శిశువుకు శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో డాక్టర్లు ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో చికిత్స్ అందించారు. 
 
అయినా కూడా చిన్నారి ప్రాణాన్ని కాపాడలేకపోయారు. మొన్నీమధ్య ఫిలిప్పీన్స్‌లో ఇంతకుముందు ఏడేళ్ల చిన్నారి కూడా కరోనా వైరస్ సోకి మరణించిన సంగతి తెలిసిందే. రోగనిరోధక వ్యవస్థ సంక్రమణకు అతిగా స్పందించి శరీర అవయవాలను దెబ్బతీసినప్పుడు ఆ బిడ్డకు ప్రాణహాని తప్పలేదని వైద్యులు తెలిపారు.