సంబంధిత వార్తలు
- కరోనా మహమ్మారి తగ్గిపోతుంది కానీ... సామాజిక దూరం పాటించాలి...
- అమెరికాలో అల్లకల్లోలం... 24 గంటల్లో పది వేల కరోనా కేసులు
- కరోనాపై యుద్ధం .. ఈ 21 రోజులూ ఇల్లు దాటొద్దు : మోడీ వినతి
- కిరణా సరుకులకు ఆందోళన వద్దు.. పరుగులు తీయొద్దు.. ప్రధాని విజ్ఞప్తి
- చైనాలో కొత్త హంటా వైరస్.. బస్సులో వ్యక్తి మృతి.. ఎలుక, ఉడుత వల్ల?
కరోనాను క్యాష్ చేసుకుంటారా? ఇది సమయం కాదు.. అలీ
Ali
దీనిపై టాలీవుడ్ హాస్య నటుడు స్పందించాడు. ఇలా రేట్లు పెంచేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి కోసం ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయల విరాళం ఇచ్చిన అలీ.. ఇలా ధరలు పెంచేయడం సరికాదన్నారు. ఇది సంపాదించే సమయం కాదని, ఎంత రేటు ఉంటే అంతకే అమ్మాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.
దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటూ, తాను గత 10 రోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని అలీ వ్యాఖ్యానించారు. ఇటలీలో వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని అలీ కోరారు.
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో కరోనాపై పోరు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానిత కేసులను గుర్తించి, నమోదు చేయడానికి గాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఏపీలోనూ కరోనా సోకకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
