సంబంధిత వార్తలు
- చంద్రబాబుపై మరో కేసు నమోదు.. బెయిల్ వచ్చినా జైల్లో ఉంచేలా ప్లాన్..
- టీడీపీ నేతలపై పోలీసుల జులుం.. కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఎస్ఐ
- రాజమండ్రి జైలుకు చంద్రబాబు... ప్రత్యేక గది కేటాయించాలని కోర్టు ఆదేశం
- ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ముజిగల అత్యాధునిక మ్యూజిక్ అకాడమీ ప్రారంభం
- స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ తిరస్కరణ?
అత్యంత విషమంగా ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం... ఐసీయూలో అడ్మిట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తన అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.
గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో పాటు పక్షవాతంతో బాధపడుతున్నారు. తాజాగా యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, పార్టీ అధినాయకత్వంతో ఏర్పడిన విభేదాలు ఉన్నప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతూ, యాక్టివ్‌గా ఉండటం లేదు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ తరుణంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. డీఎస్ చిన్న కుమారుడు డి.అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.