నిన్న ముత్తిరెడ్డికి.. నేడు బాజిరెడ్డికి కరోనా..

corona
corona
సెల్వి| Last Updated: సోమవారం, 15 జూన్ 2020 (19:50 IST)
తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే తెలంగాణలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా సోకింది. ఒక రోజు గ్యాప్‌తో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా కన్ఫర్మ్ అయ్యింది. ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా రావడంతో నిజామాబాద్ అధికారులు అప్రమత్తం అయ్యారు. బాజిరెడ్డితో ఎవరెవరు కాంటాక్ట్ ఉన్నారో వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే బాజిరెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఓపెనింగ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఎవరెవర్ని కలిశారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు కరోనా సోకి 24 గంటలకు కూడా కాకముందే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేతో అర్బన్ ఎమ్మెల్యే కాంటాక్ట్‌లో ఉండటం వలన ఆయనకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే గణేష్ గుప్తాలో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.దీనిపై మరింత చదవండి :