శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (13:07 IST)

కరోనా మంచే చేసిందా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో భార్యాభర్తల బంధం బలపడిందా?

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న వేళ.. చాలామంది ఉద్యోగులు ఇంటిపట్టునే వుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ.. ఇంటికే పరిమితం అవుతున్నారు. కరోనా వైరస్ కారణంగా మెజారిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల భార్యాభర్తల మధ్య బంధం పెరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 
 
గతంలో విదేశాలంటే మోజు చూపించే టెక్కీలు ఇప్పుడు దేశంలోనే ఉండి ఉద్యోగం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమైంది. దాదాపు నెల రోజుల పాటుగా టీటా నిర్వహిస్తున్న సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
వర్క్ ఫ్రం హోం పెద్ద ఎత్తున సాగుతున్న వారి వద్ద జరిపిన సర్వేలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్‌నే ఇష్టపడుతున్నారట. నిమ్‌హన్స్ రిపోర్ట్ ప్రకారం అధికంగా విడాకులు ఉండే రంగం ఐటీ పరిశ్రమ కాగా, వర్క్ ఫ్రం హోం అమలు సమయంలో భాగస్వామితో అనుబంధం ఎలా ఉందనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. వర్క్ ఫ్రం హోంలో భాగస్వామితో అనుబంధం ఎలా ఉంది? అనే ప్రశ్నకు బాగుంది అనే సమాధానం వచ్చింది. 
 
వర్క్ ఫ్రం హోం విషయంలో టెక్కీలు తమ అభిప్రాయాలు పంచుకుంటూ మరిన్ని సదుపాయాలు కల్పిస్తే వర్క్ ఫ్రం చేసేందుకు తమకు ఇబ్బందులు ఏవీ లేవని చెప్పుకొచ్చారు. గతంలో విదేశాల్లోని ప్రాజెక్టుల విషయంలో అత్యంత ఆసక్తి చూపే టెక్కీలు ఇప్పుడు మునుపటి ఆసక్తి చపడం లేదని వెల్లడించారు. 
 
సో.. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామంది ఉద్యోగుల జీవితాన్ని మార్చేస్తుందని.. హడావుడిగా ఉద్యోగాల కోసం పరుగులు తీసే జనాలు ప్రస్తుతం ఇంటి పట్టునే వుండి.. ఉద్యోగం చేస్తూనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. ఇంకా భార్యాభర్తల అనుబంధం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా బాగానే బలపడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది.