1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Munugode bypoll on November 3, ECI releases schedule

మునుగోడు ఉప సమరానికి మోగిన ఎన్నికల నగారా

election commission of india
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరుగనుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల మూడో తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఆరో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితానాన్ని వెల్లడిస్తారు. 
 
ఈ ఉప ఎన్నికకు సంబంధించిన 7వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్ జారీచేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 14వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. 15వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తే, 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబరు 3వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఆరో తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాగా, ఈ మాజీ ఎమ్మెల్యే ఈ దఫా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అలాగే, తెరాస, కాంగ్రెస్ పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అన్నాశాలైలో బైక్‌ స్టంట్‌ చేసిన హైదరాబాద్‌ అబ్బాయ్.. కోర్టు భలే తీర్పు! (video)