సంబంధిత వార్తలు
- అరకు ఎంపీ వివాహం... - వైజాగ్‌లో రిసెప్షన్... హాజరుకానున్న సీఎం
- పర్యావరణ హితం సేంద్రీయ వ్యవసాయం... ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
- గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్... ఉద్యోగం మానేస్తే జీతం వెనక్కి ఇవ్వాల్సిందే...
- 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులా? తగ్లక్ పాలనలా వుంది : నాదెండ్ల
- జగన్ పాలనలో తాగుబోతులకు షాక్.. భారీగా మద్యం ధరల పెంపు
వైకాపా ఎమ్మెల్యే రోజాకు జాక్‌పాట్ : నెల వేతనం ఎంతో తెలుసా?
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా సినీ నటి ఆర్కే. రోజా వైకాపా తరపున ఎంపికయ్యారు. ఈమె మంత్రి పదవిపై గంపెడాశాలు పెట్టుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కానీ, ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల పెట్టుబడుల సంస్థ (ఏపీఐఐసీ)కు ఛైర్‌పర్సన్‌గా నియమించారు. ఇందుకోసం ఆమెకు నెలకు వేతంగా రూ.3.82 లక్షలుగా చెల్లించనున్నారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తంలో
రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించిన ప్రభుత్వం.. వాహన సౌకర్యానికి 60 వేలు, అధికార క్వార్టర్స్‌లో నివాసం లేని యెడల వసతి సౌకర్యానికి 50 వేలు, మొబైల్ ఫోన్ చార్జీలకు 2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీత భత్యాలు చెల్లించేందుకు 70 వేల రూపాయలు చొప్పున కేటాయించింది.
