1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Police Reaction Over Hijra Devotees In Sabarimala

తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి..

Police
అవును. తొలిసారిగా అయ్యప్ప స్వామి హిజ్రాలకు దర్శనమిచ్చారు. ఇప్పటివరకూ పురుషులకు మాత్రమే అయ్యప్ప దర్శనం వుంటుంది. కానీ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అయ్యప్ప స్వామిని మహిళలు కూడా దర్శనం కల్పించారు. 
 
సుప్రీం తీర్పుపై మళ్లీ విచారణ జరుగనున్న నేపథ్యంలో.. అన్నీ వర్గాల మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అనుమతించకూడదని పలు మహిళా సంఘాలే పోరుబాట పట్టాయి. ఇంకా అన్నీ వర్గాల మహిళలు స్వామిని దర్శించుకోకూడదని.. మహిళలే ఆందోళనలు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చారు. కొందరు హిజ్రాలు ఇరుముడితో స్వామిని దర్శించేందుకు వచ్చారు. అయితే వారిని ముందు జాగ్రత్తగా 16వ తేదీన పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఆపై ఆలయ ప్రధాన పూజారి రాజీవర్‌తో జరిపిన చర్చల అనంతరం.. పటిష్ట బందోబస్తు మధ్య అయ్యప్ప దర్శనం కల్పించారు. పలువురు భక్తులు హిజ్రాలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో అయ్యప్పను హిజ్రాలు శరణు ఘోష చేస్తూ.. హిజ్రాలు దర్శించుకున్నారు.
తర్వాతి కథనం
పెళ్ళి పీటలపై ప్రియురాలు... అదేపనిగా ఆమెనే చూస్తున్న ప్రియుడు... ఏమైంది?