మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (15:11 IST)

కన్నబిడ్డపై కన్నతల్లి లైంగిక దాడి.. ఫోటో తీసి బాయ్‌ఫ్రెండ్స్‌కు..

సభ్యసమాజం తలదించుకునే చర్య అమెరికాలో జరిగింది. మాతృత్వానికే ఆ తల్లి మచ్చ తెచ్చింది. అమెరికాలో నాలుగేళ్ల బాలుడిపై అతని తల్లి లైంగిక దాడికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన క్రిస్టల్ అనే మహిళకు నాలుగేళ్లలో ఓ కుమారుడు వున్నాడు. క్రిస్టల్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల బాలుడిపై క్రిస్టల్ లైంగిక వేధింపులకు పాల్పడింది. 
 
అంతేకాకుండా తన కుమారుడిపై తాను పాల్పడే లైంగిక దాడిని ఫోటో తీసి మరీ తన బాయ్‌ఫ్రెండ్స్‌కు పంపింది. అయితే ఈ ఫోటోలు పోలీసుల చేతికి చిక్కడంతో ఫిర్యాదు పేరిట పోలీసులు క్రిస్టల్‌ను అరెస్ట్ చేశారు. కన్నతల్లే ఇలాంటి అకృత్యాలకు పాల్పడటం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.