శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 15 డిశెంబరు 2018 (15:07 IST)

ఇలా చేస్తే పొట్టిగా వున్న పిల్లల్లో ఎదుగుదల వస్తుంది... ఏం చేయాలంటే?

ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలలో పెరుగుదల చాలా తక్కువుగా ఉంటుంది. ఈ పెరుగుదలకు వంశపారంపర్యం ఒక కారణం. అయితే మనం సరియైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల కూడా మన పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. టీనేజ్ సమయంలో పెరుగుదలకు సంబందించిన హార్మోను ఎక్కువుగా విడుదలవుతుంది. ఈ సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవటం వలన మంచి పెరుగుదల ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం.
 
1. ఉసిరికాయను రోజు తీసుకోవటం వల్ల ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, పాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి తోడ్పడతాయి.
 
2. గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం పటికబెల్లం పొడిని, కొంచెం తేనెను కలిపి ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో రెండు స్పూన్ల చొప్పున తినటం వల్ల పొడవును పెంచే టిష్యూలను బిల్డప్ చేయటానికి మరియు కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
 
3. ప్రతి రోజు ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట త్రాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 
4. ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటికబెల్లం తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిని సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు గ్లాసు పాలలో ఒకస్పూన్ పొడిని కలుపుకొని త్రాగటం వలన పిల్లలు ఎత్తు పెరిగే అవకాశం వుంది.
 
5. మనం రోజువారి తీసుకునే ఆహారంలో బచ్చలికూర, క్యారెట్, బెండకాయ, సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగటానికి దోహదపడతాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.
 
6. వీటితో పాటు ప్రతిరోజు వ్యాయామం చేయటం, సైకిల్ తొక్కటం, స్కిప్పింగ్ ఆడటం వలన కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది.