మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (12:38 IST)

గోవుకు గౌరవం : హిమాచల్ రాష్ట్ర మాతగా ఆవు

గోవుకు గౌరవం దక్కింది. రాష్ట్ర మాతగా ఆవును ఎంపిక చేశారు. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. 
 
దేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో గోసంరక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గోవును రాష్ట్ర మాతగా ప్రకటించారు. గోవు పాలు ఇవ్వడం మానెయ్యగానే దాన్ని వధించడం ఆపాలని శాసనసభ్యులంతా ముక్తకంఠంతో కోరారు. దీంతో ఆవును రాష్ట్ర మాతగా ప్రకటించి కేంద్రానికి తెలిపారు. 
 
ఇకపోతే, ఆవుల సంరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఇప్పటికే, సిర్మావూరు జిల్లాలో రూ.1.52 కోట్లతో ఆవుల కోసం ప్రత్యేకంగా అభయారణ్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వీరేందర్ కన్వర్ వెల్లడించారు. 
 
అలాగే, సోలన్, కాంగ్రా జిల్లాల్లోనూ ఆవుల అభయారణ్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గౌరి పేరిట లోకల్ ఆవుల బ్రీడ్‌ను ప్రోత్సహించాలని సూచించారు ఎమ్మెల్యేలు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు రాజస్థాన్ రాష్ట్రం కూడా ఆవుల పరిరక్షణకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది.