మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (12:02 IST)

బాబు మిమ్మల్నే పిలుస్తున్నాడు...

విష్ణు ఇంటికొచ్చేసరికి భార్య సీత తన బాబుకి మాటలు నేర్పిస్తూ కనబడింది.. నాన్నా నాన్నా అని.. అంటోంది..
విష్ణు.. అమ్మకు బదులు నాన్నా అని నేర్పిస్తున్నందుకు ఎంతో మురిసిపోయాడు..
వారాలు గడిచాయి..
ఓ అర్ధరాత్రి నాన్నా అంటూ బాబు ఏడ్వడం మొదలు పెట్టడంతో భార్యాభర్తలకు మెళకువ వచ్చింది..
సీతేమో.. అటుతిరిగి ముసుగుపెడుతూ...
చూడండి.. బాబు మిమ్మల్నే పిలుస్తున్నాడు.. వెళ్లి ఎత్తుకోండి.. అని చెప్పింది..
అప్పుడు అర్థమైంది నాన్నా అని ఎందుకు నేర్పించిందో...