సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (10:45 IST)

స్టెప్పులతో కాకపుట్టించిన బార్బీగర్ల్ కత్రినా కైఫ్ (Video)

బాలీవుడ్ బార్బీగర్ల్ కత్రినా కైఫ్. బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ నటిస్తున్న చిత్రం "జీరో". ఈ చిత్రంలో కత్రినా కైఫ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మద్యానికి బానిసైన బబితా కుమారి అనే సినీ స్టార్ పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమెకు ఓ పాట కూడా ఉంది. ఈ పాటలోకాక పుట్టించే స్టెప్పులతో యూత్‌ని పిచ్చెక్కించేలా చేసింది. 
 
నిజానికి ఈ చిత్రంలో కత్రినా అంటే షారూక్‌కు ఎనలేని ప్రాణం. ఆమె వాళ్ళ ఊరికి వ‌స్తుంద‌ని తెలియ‌గానే స్నానం వ‌దిలేసి మ‌రీ మ‌ధ్య‌లో వెళ్ళిపోతాడు. ఈస‌న్నివేశాన్ని తాజాగా విడుద‌లైన సాంగ్‌లో చూపించారు. 
 
'హుస్న్‌ పరచమ్‌..' అంటూ సాగే ఈ ప్రత్యేక గీతంలో క‌త్రినా త‌న స్టెప్పుల‌తో ఆక‌ట్టుకుంది. 'బబితా కుమారి వచ్చింది.. ఈ ఏడాది ఈ పాట హైలైట్‌గా నిలవబోతోంది' అంటూ షారూఖ్ ఈ పాట‌ని షేర్ చేశారు. ఈ సాంగ్ ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. 
 
డిసెంబ‌ర్ 21వ తేదీన విడుద‌ల కానున్న ఈ చిత్రం ఆనంద్ ఎల్.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. అనుష్క శ‌ర్మ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించింది. స‌ల్మాన్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు అతిథి పాత్ర‌ల‌లో మెర‌వ‌నున్నారు. షారూఖ్ భార్య గౌరీ‌ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో షారూఖ్ మ‌రుగుజ్జుగా క‌నిపించ‌నున్న విష‌యం విదిత‌మే.