గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (16:29 IST)

పీవీ సింధు బయోపిక్.. కోచ్ గోపిచంద్ పాత్రలో సోనూసూద్..

బాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన బయోపిక్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో క్రీడాకారుల బయోపిక్‌లు కూడా వున్నాయి. ఇప్పటికే ధోనీ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. దంగల్ కూడా బంపర్ హిట్ అయ్యింది. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. 
 
శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. మరోవైపు మరో హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఈ సినిమాను నిర్మించేందుకు ప్రముఖ నటుడు సోనూసూద్ సిద్ధమవుతున్నాడు.
 
ఉత్తరాదినే కాకుండా.. దక్షిణాదిన కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న సోనూసూద్.. పీవీ సింధు బాల్యం నుంచి ఒలింపిక్ మెడల్ సాధించేవరకూ గల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రధానపాత్రను పోషించే నటి కోసం అన్వేషిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించడమే కాకుండా పీవీ సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రను సోనూసూద్ పోషించనుండటం గమనార్హం.