శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (13:10 IST)

పాలు పితికిన వెంటనే తీసుకుంటున్నారా.. జాగ్రత్త.?

ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దాంతో పాటు శరీరానికి అవసరమైన పదార్థాలను అందిస్తాయి. ప్రతిరోజూ గ్లాస్ ఆవు పాలు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బరువు తక్కువగా ఉన్నవారికి ఈ పాలు మంచి టానిక్‌లా పనిచేస్తాయి. ఇన్ని లాభాలిచ్చే పాలను పచ్చిగా తీసుకుంటే మంచిదో కాదో తెలుసుకుందాం...
 
అప్పుడే పితికిన ఆవు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరు అనుకుంటారు. కానీ ఇది తప్పు అంటున్నారు పరిశోధకులు. పచ్చిపాలు బాగా వేడిచేయకుండా తాగినప్పుడు వాటిలోని బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా క్షయ, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. 
 
పచ్చిపాల మీద ఉండే మీగడ, వెన్న కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయట. పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద కనీసం పదిహేను నుంచి ఇరవై సెకన్ల పాటు బాగా మరిగించిన తర్వాతే వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసిపిల్లలకు ఇచ్చే పాలను మరింత ఎక్కువ సమయం మరిగించాలనీ, అప్పుడే వాటిలోని బ్యాక్టీరియాలు నశిస్తాయని కూడా అంటున్నారు. అప్పుడే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. కనుక వీలైనంత వరకు పచ్చిపాలు తీసుకోవడం మానేస్తే మంచిది.