గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (15:25 IST)

వేప పువ్వును నేతిలో వేయించి తీసుకుంటే..?

సాధారణంగా చాలామంది వేప పువ్వును ఎక్కువగా ఉపయోగించరు. ఆ పువ్వుతో మనకేం పనుందని అనుకుంటారు. దీనిలోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పకుండా ఈ పువ్వును ఉపయోగించాలనిపిస్తుంది. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..
 
1. వేప పువ్వులలో బెల్లం, కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా నీరు కలిపి నూరండి. దీనిని పచ్చడిలా ఆహారంలో తీసుకుంటే కడుపులో క్రిములు పోవడమే కాకుండా జీర్ణశక్తిని కలిగించి ఆకలిని పుట్టిస్తుంది. 
 
2. వేప పువ్వులను ఎండబెట్టుకుని వాటిల్లో కొద్దిగా తేనె కలుపుకోవాలి. మళ్లీ ఆ పువ్వులను ఎండలో కొన్నాళ్ళుంచి గట్టిపడిన తరువాత ప్రతిరోజూ ఉదయాన్నే ఒక చెంచా చొప్పున తీసుకుంటే కఫ దోషం పోతుంది. 
 
3. ఎండిన వేప పువ్వులను నేతిలో దోరగా వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కారం చల్లి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
4. వేప పువ్వులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొన్ని పుదీనా ఆకులు, కాఫీ పొడి స్పూన్ చక్కెర వేసి బాగా మరిగించుకోవాలి. ఈ తయారైన మిశ్రమాన్ని రోజూ భోజనాంతరం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది.