శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (14:51 IST)

తంగేడు పువ్వుల పేస్టుంటే చాలు.. బ్యూటీపార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు..

తంగేడు పువ్వులు ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. గుప్పెడు తంగేడు పువ్వులను బాగా పేస్టు చేసుకుని ఎండలో ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. ఆ నూనెను తలకు పట్టించడం ద్వారా చుండ్రు సమస్య వుండదు. హెయిర్ ఫాల్ వుండదు. జుట్టు వత్తుగా పెరుగుతుంది. చర్మం సౌందర్యం పెంపొందుతుంది. 
 
ముఖంపై వున్న మచ్చలను తంగేడు పువ్వుల పేస్టు తొలగిస్తుంది. అందుకే తంగేడు పువ్వులను బాగా పేస్టు చేసుకుని ముఖానికి రోజుకోసారి పట్టిస్తే బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం వుండదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
తంగేడు పువ్వులను, వెల్లుల్లిపాయలతో కలిపి కాస్త పప్పు చేర్చి వండుకుని వారానికి ఓసారి తింటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. తంగేడు పువ్వులను గ్లాసుడు నీటిలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అంతేకాదు.. మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. 
 
హెయిర్ ఫాల్ సమస్య వుంటే.. తంగేడు పువ్వులు, మందార పువ్వులు, కొబ్బరి పాలును సమపాళ్లలో తీసుకుని బాగా పేస్టులా చేసి శిరోజాలకు పట్టించాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.