సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (16:19 IST)

స్త్రీలు ఆ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించాలంటే..?

సాధారణంగా చాలామంది స్త్రీలకు బహిష్టు సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఈ నొప్పి నుండి విముక్తి చెందాలని రకరకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఫలితం ఉండదు. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
 
రోజుకు ఓసారైన టీ తాగాలి. వేడి టీ కండరాల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లం టీ, పెప్పర్ టీ, లావెండర్ టీ, గ్రీన్ టీ, యాలకుల టీ, లెమన్ గ్రాస్ టీ, హెర్బల్ టీ ఏది తాగినా ఆ సమయంలో మంచిదే. 
 
హెర్బల్ టీ.. అలసట పోగొట్టటమే కాకుండా నొప్పిని కూడా తగ్గిస్తుంది. బహిష్టు సమయంలో కాఫీ తాగరాదు. కాఫీ రక్త నాళాలను ముడుచుకొని పోయేటట్లు చేస్తుంది. అయితే కాఫీ తాగకుండా ఉండలేని వారు పీరియడ్స్ కొద్ది రోజుల ముందర నుండి కాఫీ తాగడాన్ని తగ్గించుకుంటూ వస్తే బహిష్టు సమయంలో తాగకుండా ఉండగలిగే ప్రయత్నం చేయగలరు. 
 
రోజూ కనీసం ఆరు నుండి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగడం వలన ఆ సమయంలో నొప్పి నుండి సాంత్వన పొందుతారు. అల్లం బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది. బహిష్టులు సక్రమంగా వచ్చేట్టు చేస్తుంది. అల్లాన్ని మెత్తగా తురిమి కప్పు నీళ్లలో 5 నిమిషాలు పాటు మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి  అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. బహిష్టు సమయంలో ఈ టీ ని రోజుకు మూడుసార్లు తాగితే కడుపునొప్పి, ఇతర బాధలు తగ్గుతాయి. వేడినీళ్ల బ్యాగును ఉపయోగిస్తే కూడా బహిష్టు నొప్పి తగ్గుతుంది.