గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (12:24 IST)

ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఇది తీసుకోవాల్సిందే..?

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్న వాటిపై జాగ్రత్తలు పాటిస్తుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. టమోటాలో విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో షుగర్‌ నిల్వలు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతేకాదు ఆస్తమాను అరికట్టడంలో కూడా ఇది దోహదపడుతుంది.
 
అలాగే శీతాకాలంలో తీసుకోవాల్సినవి కాన్‌బెర్రీలు. ఇవి రుచిగా ఉండటంతో పాటు, గుండెజబ్బులను, దంతక్షయాన్ని కూడా నివారించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఇక టొమాటోలు కూడా శీతాకాలంలో తీసుకోవాల్సినవవి. టమోటాలో లైకోపిన్‌ అనే ఖనిజం ఇందులో ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్‌ నుండి విముక్తి చెందేలా చేస్తుంది. గుండె జబ్బులు రావు. ఎముకల్ని దృఢపరచడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ నిలువలను తగ్గిస్తుంది.
 
చలికాలంలో చాలామంది ఆస్తమా వ్యాధితో ఎక్కువగా బాధపడుతుంటారు. అసలు ఈ వ్యాధి ఎలా వస్తుందంటే.. జలుబు వచ్చినప్పుడు మన శరీరంలో ఆ జలుబు ద్రవం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే ఆస్తమా వ్యాధి వస్తుంది. దీనికి తోడుగా దగ్గు పుంజుకుంటుంది. ఈ సమస్యల కారణంగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వీటికి చెక్ పెట్టాలంటే.. టమోటాలు తీసుకోవాల్సిందే..
 
టమోటాలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబుగా ఉన్నప్పుడు టమోటాను గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే జలుబు నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది.