బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (10:49 IST)

బాదం మిశ్రమాన్ని పాలలో కలిపి తీసుకుంటే..?

సూపర్ ఫుడ్ జాజితాలో బాదం ముందు వరుసలో ఉంటుంది. వీటిలో ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, మెగ్నిషియం, జింక్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని మినరల్స్ కంటి ఆరోగ్యానికి చాలా ఉపకరిస్తాయి. బాదంలోని మరికొన్ని ప్రయోజనాలు ఓసారి పరిశీలిద్దాం...
 
1. చాలామంది తరచు బాదం పప్పులను నేరుగానే తీసుకుంటారు. బాదాం శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియకు సాయం చేస్తుంది. అంతేకాదా.. శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తుంది. బాదం పప్పులను నానబెట్టి తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.
 
2. బాదం తీసుకునేటప్పుడు దాని పొట్టును కూడా తీసుకోవాలి. బాదం పొట్టులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తుంది. ఈ చలికాలంలో వీటిని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
3. రాత్రివేళ కప్పు బాదం పప్పులను నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని శుభ్రం చేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ పాలలో వేసి కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటారు. 
 
4. బాదం పప్పులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీర ఒత్తిడి, అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. బాదం మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా, ఎంతో కోమలంగా మారుతుంది. 
 
5. పావుకప్పు బాదం పప్పులను పేస్ట్ చేసి అందులో కొద్దిగా కలబంద గుజ్జు, నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే.. ముఖంపై గల నల్లటి మచ్చలు, వలయాలు పోతాయి. 
 
6. బాదం పప్పులను నానబెట్టుకుని పొట్టు తీసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన మిశ్రమంలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది.