గ్లాస్ పాలలో ఈ పదార్థాలు కలిపి తీసుకుంటే...?
చాలామంది ఎముకలు, కండరాలు బలహీనత కారణంగా పలుమార్లు అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. ఇలా బలహీనతగా ఉంటే.. ఆస్టియోపోరోసిన్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో క్యాల్షియం, విటమిన్ డి తగ్గిపోవడం వలనే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన రోజూ మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో విటమిన్ డి అధిక మోతాదులో ఉండేలా చూసుకోవాలి. మరి ఎముకలు బలంగా ఉండాలంటే.. ఏం చేయాలో చూద్దాం...
1. గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, పిప్పళ్ల చూర్ణం కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
2. ప్రతిరోజూ మీరు తాగే పాలలో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి సేవిస్తే ఫలితం ఉంటుంది.
3. గ్లాస్ మరిగించిన పాలలో స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే ఎముకల బలానికి ఎంతో సహాయపడుతుంది.
4. తెల్ల నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా చక్కెర, పాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా తరచుగా క్రమం తప్పకుండా చేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
5. క్యాల్షియం పరిమాణం ఎక్కువగా ఉన్న పెరుగు, బాదం పప్పు, పాలకూర, మునగాకు, పాలు, గుడ్లు వంటివి నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయని చెప్తున్నారు.