శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (14:06 IST)

భోజనాల గది ఆ దిశలో ఉంటే..?

ఈశాన్య దిశలో పూజగది, తూర్పున స్నానాలగది, దక్షిణ - నైరుతి దిశల మధ్య మరుగుదొడ్డి, నైరుతిలో ఆయుధాగారము, పశ్చిమ నైరుతిలో విద్యాభ్యాస మందిరం నిర్మించాలి. అలానే వాస్తు ప్రకారం ధనాగారం, భోజనాల గది, వంటగది ఏ దిశల్లో అమర్చుకోవాలో తెలుసుకుందాం..
 
ధనాగారం:
ధనం, విలువైన ఆభరణాలు, వస్తువులు ఉండే బీరువాలు, ఇనపపెట్టలు, షెల్పులు మొదలైనవి... ఉత్తరపు గదిలో ఉత్తర దిశకు ఎదురుగా దక్షిణపు గోడకు చేర్చి పెట్టుకోవాలి. లేదా తూర్పు గదిలో తూర్పు దిక్కునకు ఎదురుగా పడమటి గోడకు చేర్చి పెట్టుకోవాలి. ఏ గదిలోనైనా ఈశాన్యమూలకు ఇది ఉండరాదు. 
 
భోజనాల గది:
పడమర దిశలో భోజనాల గదిని నిర్మించుకోవాలి. తూర్పు దిక్కునకు ఎదురుగా పశ్చిమ దిశలో కూర్చొని భోజనాలు చేయడం మంచిది. పడమటి దిశకు ఎదురుగా కూర్చొని భోజనం చేయరాదు. ఒకవేళ అలా చేస్తే ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని పండితులు చెప్తున్నారు. 
 
వంటగది:
వంటగది ఆగ్నేయదిశలో ఉండాలి. అలా కుదరనపుడు దక్షిణ నైరుతిలో వంటగది కట్టుకోవచ్చు. తూర్పు, ఈశాన్యం, ఉత్తర దిశల్లో మాత్రం వంటగది కట్టకూడదు. వంటగదిలో ఆగ్నేయ భాగంలో పొయ్యి ఉండడం శ్రేయస్కరం. ఇతర దిశలలోగాని, మూలలలోగాని పొయ్యి వేయకూడదు. ఈశాన్యం, ఆగ్నేయం, నైర్పతి, వాయవ్యం ఈ నాలుగు మూలలకు ఎదురుగా పొయ్యి ఉండరాదు. పడమటి దిక్కుకు ఎదురుగా పొయ్యివేసి, తూర్పు దిశకు ఎదురుగా ఉండి వంట చేయడం మంచిది. తూర్పుముఖంగా పొయ్యి ఉండరాదు.