శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 30 నవంబరు 2018 (10:38 IST)

శీతాకాలంలో కమలాపండుతో ఎంతో అందంగా...

చలికాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లలో కమలాపండు ఒకటి. దీనిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి మంచి నిగారింపునిస్తుంది. కమలాపండులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తరచూ తీసుకోవటం వలన మూత్రపిండాలలో ఉన్న రాళ్లను తగ్గించుకోవచ్చు. ఇది ఆరోగ్యపరంగానే కాకుండా చర్మానికి మంచి పోషణను ఇస్తుంది. దీని ప్రయోజనమేమిటో చూద్దాం.
 
1. ఆరెంజ్ తొనలను తొలగించి వాటితో ముఖానికి మసాజ్ చేయాలి. ఇలా మర్ధన చేసిన పది నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం టైట్‌గా మారుతుంది. ఇది ముఖంలో జిడ్డును తొలగించి కాంతివంతంగా మార్చుతుంది. వయస్సు పైబడినట్లు కనబడనియ్యదు. ఇలా ప్రతిరోజూ స్నానం చేసే ముందు రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
 
2. రెండు టీస్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌కు కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఆరాక చన్నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మంకు మంచి నిగారింపువస్తుంది. ఇది సూర్యరశ్మి నుండి కాపాడి చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.
 
3. పసుపులో ఆరెంజ్ జ్యూస్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత  శుభ్రపరుచుకోవాలి. మృతకణాలు, మురికి తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. మొటిమలు, మచ్చలు నివారించబడతాయి.
 
4. ఆరెంజ్ తొక్కలు, ఓట్స్ కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమం  చర్మాన్ని నేచురల్‌గా, క్లియర్‌గా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండిటి మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంతో పాటు, బ్లాక్ హెడ్స్, మచ్చలను తొలగించి ప్రకాశవంతంగా మార్చుతుంది.