ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (14:08 IST)

వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇవి తినండి..

ఇపుడు ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటి వారు మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే వెన్నునొప్పి మటుమాయం కావడమేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకున్నట్టయితే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఆహార పదార్థాలేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
చేపలు : చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. అందువల్ల వారానికి కనీసం రెండుసార్లు చేపలను తీసుకున్నట్టయితే శరీరానికి విటమిన్ డి అందుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా మారి వెన్నునొప్పితో పాటు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. 
 
పాలు : మంచి బలవర్ధక ద్రవ పదార్థం. వీటిలో విటమిన్ డితో పాటు.. క్యాల్షియంలు పుష్కలంగా ఉంటాయి పాలను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వెన్ను నొప్పితో పాటు ఇతర నొప్పులు కూడా మాయమైపోతాయి. చీజ్‌లోనూ క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఆరగించడం వల్ల కూడా ఈ నొప్పులు తగ్గుతాయి. 
 
కోడిగుడ్లు 
కోడిగుడ్లలో విటమిన్ డి శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చసొనలోనే ఇది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పచ్చసొనతో రోజూ ఒక కోడిగుడ్డును ఆరగించినట్టయితే వెన్ను నొప్పి నుంచి పూర్తిగా విముక్తులు కావొచ్చు.